వృద్ధాశ్రమంలో వృద్ధులకు బీజేపీ చేయూత

29-09-2026 | 10:20pm

జవహర్‌నగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్(Seva Sankalp Abhiyan)’ నెల రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, ఇతర అవసరమైన వస్తువులను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, లక్ష్మి గోపాల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు సంతోష్ గుప్తా, మరాఠీ బాబు, ఓబీసీ మోర్చా నాయకులు వేణుగోపాల్, భిక్షపతి, కిషోర్ గౌడ్, గక్కల రాము, బాలరాజ్ గౌడ్, యాదగిరి, భీమా రాణి, లిఖిత యాదవ్, లక్ష్మి రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, మహేష్ గౌడ్, రాజు, బొమ్మ యాదగిరి, భావని, జ్యోతి, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు