సెయింట్ క్లారిట్ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం
500 మందికి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ
32 మందికి మెడిసిటీ హాస్పిటల్‌లో ఉచిత ఆపరేషన్లు
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని సెయింట్ క్లారిట్ హైస్కూల్‌లో శనివారం రోజు ప్రిన్సిపాల్ జోసెఫ్ శాందప్ప ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లి దండ్రులకు బీపీ, షుగర్, కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు థైరాయిడ్ గడ్డలు, చర్మ సమస్యలు, పిల్లల సంబంధిత వ్యాధులకు సంబంధించి నిపుణులైన వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 500 మందికి బిపి,షుగర్ పరీక్షలు చేయగా తదుపరి వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు అవసరమైన 32 మందిని గుర్తించి మెడిసిటీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.రిఫర్ చేసిన రోగులకు మెడిసిటీ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు,వైద్య పరీక్షలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.