ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే కృష్ణారావు.

29-09-2026 | 10:43pm

కూకట్ పల్లి, సెప్టెంబర్ 29, (విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు(MLA Madhavaram Krishna Rao) డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నత్త నడక సాగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని, పెదప్రజల ఓట్లు తొలగించే విదంగా అధికారులు వ్యవహారిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

మంగళవారం కూకట్ పల్లి ఈ ఆర్ ఓ, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను అయన కార్యాలయంలో కలిసి ఎస్ ఐ ఆర్ కు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బి ఎల్ ఓ లు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజమైన ఓటర్ ల ఓటు హక్కును పరిరక్షించాలని సూచించారు.నోటీసులు జారీ చేసిన ఓటర్ లను  వివిధ రకాల గుర్తింపు కార్డుల పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఆధార్, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని విచారణ జరిపి అర్హులైన వారికి ఓటర్ గా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.

క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తనికీలు నిర్వహించి ప్రజలకు, ఓటర్ లకు న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ ఆరోరా, మాజీ కార్పొరేటర్ లు ముద్ధం నరసింహ యాదవ్,ఆవుల రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్, తూము శ్రావణ్,బాబురావు,సబిహా గౌసుద్దీన్, మందాడి శ్రీనివాస రావు లు డివిజన్ లలోని ఎస్ ఐ ఆర్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుక వచ్చారు.ఎస్ ఐ ఆర్ పై సమావేశం జరుగుతున్న సమయం లో సి ఎం సి కమిషనర్ తో సమావేశం ఉందంటూ జోనల్ కమిషనర్ వెళ్లిపోవడం పై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు