బోడుప్పల్‌, మేడిపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం

10-11-2026 | 08:06pm

ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్

మేడిపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): మేడ్చల్ - మల్కాజిగిరి కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్‌, మేడిపల్లి డివిజన్ లలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం(Sri Krishna Sadar Sammelan) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు.

అనంతరం యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఐక్యత, సోదరభావాన్ని చాటుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, సంఘం పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు