జెన్సన్ దెబ్బకు ఫాలోఆన్‌లో ఆసీస్
- 99 పరుగులకే ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబాటు
- డ్రా కోసం పోరాటం
సెయింట్ జార్జ్ పార్క్, అక్టోబర్ 21 : ఆస్ట్రేలియాతో(Australia) జరుగుతున్న రెండో టెస్టు లో దక్షిణాఫ్రికా(South Africa) అద్భుతంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేయడంతో పాటు ఆసీస్‌ను కుప్పకూల్చి ఫాలోఆన్ ఇచ్చింది. వర్షం అడ్డుపడినా ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలను సృష్టించుకుంది. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ టెంబా బవుమా 179 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు అం దించాడు.
మార్కో జాన్సెన్ (85), సైమన్ హార్మర్ (82) కూడా రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత మార్కో జెన్సన్ దెబ్బ కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 99 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది.
దీంతో దక్షిణాఫ్రికాకు 326 పరుగుల భారీ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా కు ఫాలో-ఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ తడబడుతోంది. 123 పరుగు లకు 3 వికెట్లు కోల్పోయింది. మాడిసన్(8), లబూషేన్(39),రెన్షా(11) పరుగులకు ఔటయ్యారు. హెడ్ పోరాడుతున్నాడు. చివరిరో జు ఆసీస్ డ్రా కోసం పోరాడాల్సి ఉండగా, సిరీస్ సమం చేయాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు.