అనుపమ భోగి డబ్బింగ్ పూర్తి
చార్మింగ్ స్టార్ శర్వానంద్(Charming Star Sharwanand) పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి ప్రమోషనల్ కంటెంట్‌తో(Bhogi Promotional Content) ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర-ఆదిలాబాద్ సరిహద్దు(Maharashtra-Adilabad border) నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తున్నారు. కందుల సులోచన రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు డింపుల్ హయాతి మరో హీరోయిన్గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. నవంబర్ 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.