రియాద్‌పై హౌతీల భీకర దాడులు
కింగ్‌ఖాలిద్ విమానాశ్రయంతో పాటు మరో నాలుగు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులు
ముగ్గురు మృతి, 36 మందికి తీవ్ర గాయాలు
యెమెన్‌లోని 80 హౌతీ స్థావరాలపై అటాక్
రియాద్/సనా, అక్టోబర్ 8: సౌదీలోని రియాద్ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Riyadh King Khalid International Airport)పై హౌతీలు విరుచుకుపడ్డారు. భారీ ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడ్డారు. హౌతీలు తాజాగా జరిపిన ఈ దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.
దాడులు చేసింది తామేనని హౌ తీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. రాబిగ్‌లోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారం, అసిర్ ప్రాంతంలోని అభా వి మానాశ్రయం, ఖమీస్ ముషైత్ వైమానిక స్థావరం, అఖిఫా సైనిక శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించామని సరీ పేర్కొన్నారు. మరోవైపు యెమెన్‌లోని ౮౦ హౌతీ స్థావరాలపై సౌదీ దాడులు చేసినట్లు ప్రకటించింది. సౌదీలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ ౧౦ వరకు ఏయిర్ ఇండియా, ఇండిగో విమానాలను రద్దు చేస్తున్న ఆ సంస్థలు ప్రకటించాయి. ప్రయా ణికులకు రీఫండ్‌ను అందిస్తామన్నాయి.