నవంబర్ 13న మౌళి మూవీ రిలీజ్

06-10-2026 | 07:15pm

టాలీవుడ్‌లో మరో ఫన్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యువ నటుడు మౌళి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీను కంబాలా తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మక అంశాలతో రూపొందుతున్న ఈ మూవీని నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. యువతను ఆకట్టుకునే కామెడీ, ఎంటర్‌టైన్మెంట్‌ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రిలీజ్‌ డేట్‌ లాక్‌ కావడంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. నవంబర్‌ 13న ‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు