బ్లడీ రోమియోతో రొమాన్స్!
‘ది ప్యారడైజ్(The Paradise)’ సక్సెస్‌తో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత నాని దర్శకుడు సుజీత్(Sujeeth) తెరకెక్కించనున్న హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రోమియో(Bloody Romeo)’ చిత్రంలో నటించనున్నారు. యూకే ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో నాని చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా డబుల్ షేడ్స్‌లో కనిపించనున్నారని టాక్. ఈ భారీ యాక్షన్ డ్రామాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారట. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
2027 వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ వచ్చే అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇండస్ట్రీలో లక్కీ చార్మ్‌గా ముద్ర వేసుకున్న ఈ భామ, నాని లాంటి స్టార్ హీరో సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడం పట్ల సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మీనాక్షి ప్రస్తుతం నాగచైతన్యకు జంటగా ‘వృషకర్మ’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.