దివ్యౌషధం జీరో వేస్టేజ్ ప్లాంట్!

30-09-2026 | 05:15am
  1. ప్రస్తుతం ఉన్న చోటనే డంపింగ్ యార్డ్ 
  2. ఎప్పటికప్పుడు చెత్త శుద్ధీకరణకు అడుగులు
  3. రాష్ట్రంలోనే తొలిసారిగా గ్యాస్, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) : అంచల అంచలుగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న మహబూబ్ నగరానికి(Mahabubnagar) ఒక దివ్య ఔషధం(Divine medicine) లాంటి ప్రాజెక్టు వరించింది. ఆ ప్రాజెక్టు పేరే ’జీరో వేస్టేజ్ ప్లాంట్(Zero Waste Plant) ’ నగరంలో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల కాలం నుంచి కోయిలకొండ ఎక్స్ రోడ్ దగ్గర డంపింగ్ యార్డ్(Dumping yard) ఉంది. 1952 సంవత్సరంలో మున్సిపాలిటీగా రూపుదిద్దుకొని మహా నగరంగా ఎదిగిన మహబూబ్ నగర్ కార్పొరేషన్(Mahabubnagar Corporation) 60 డివిజన్లతో ప్రజాపాలన ప్రభుత్వంలో  కొలువుతీరింది.  రోజురోజుకు నగరం విస్తరించడంతో చెత్త చెదారం అత్యధికంగానే ఉత్పన్నమవుతుంది. నగర చుట్టుపక్కల ప్రజలకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీరో వేస్టేజ్ ప్లాంట్ నగరంలో ఆవిష్కృతం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 

ప్లాంట్ పని విధానం ఇలా..

ప్రస్తుతం నగరంలోని 60 డివిజన్లో నుంచి దాదాపుగా 107 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త వస్తుంది. ఈ చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా కోయిలకొండ ఎక్స్ రోడ్డు లోని డంపింగ్ యార్డ్ కు తరలిస్తుండ్రు. ఏండ్ల తరబడి ఇక్కడ చెత్త వేయడంతో ఒక్కసారిగా గుట్ట మాదిరిగా చెత్త పేరుకుపోయింది. ఈ అంశాన్ని ప్రజలు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేయాలని సంకల్పంతో ’జీరో వేస్టేజ్ ప్లాంట్’ ను తీసుకువచ్చి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధిచేసి తడి చెత్త తో గ్యాస్ ను పొడిచెత్త తో విద్యుత్ ను తయారు చేసే ప్లాంటే ’జీరో వేస్టేజ్ ప్లాంట్’. 

ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ లోనే చెత్త పూర్తిగా శుద్ధిచేసి తడి, పొడి చెత్త ను రోల్ మాదిరిగా డంపింగ్ యార్డ్ లోనే తయారు చేసి బండమీదిపల్లి దగ్గర 38 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న జీరో వేస్టేజ్ ప్లాంట్ కు తరలిస్తారు. ఇక్కడ ఎలాంటి దుర్వాసనతో పర్యావరణ ఇబ్బందులు లేకుండా ఈ ప్లాంట్ రూపకల్పన చేస్తుండ్రు. 25 ఎకరాలే ఈ ప్లాంట్ కు అవసరం ఉన్నప్పటికీ 38 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ప్లాంట్ చుట్టుముట్టు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తడి, పొడి చెత్తతో గ్యాస్ విద్యుత్తు తయారీ అనంతరం మిగిలిన పొడిని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించనున్నారు. 

నగరానికి ఎంతో మేలు..

రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడలేని జీరో వేస్టేజ్ ప్లాంట్ మహబూబ్ నగరంలోని బండమీదిపల్లి డివిజన్ లో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ లో దాదాపు 120 నుంచి 150 మంది కి స్థానికంగా ఉండేవారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు డంపింగ్ యార్డ్ లో ఎప్పటికప్పుడు చెత్తను శుద్ధి చేయడం ద్వారా ఎలాంటి దుర్వాసన వెదజల్లదని అధికారులు చెబుతుండ్రు. రాష్ట్రంలోనే మొదటిసారిగా  నగరంలో జీరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో  నగరానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

 చాలా మంచి ప్రాజెక్ట్... జీరో వేస్టేజ్ ప్లాంట్ 

జీరో వేస్టేజ్ ప్లాంట్ రావడం శుభ పరిణామం. రాష్ట్రంలోనే ఈ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చెత్తతో గ్యాస్, విద్యుత్తు  తయారు చేయడం అంటే ఇది గొప్ప ప్రాజెక్టు. ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ విషయం ను పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్లాంట్ తో ఏర్పాటు చేసే ప్రాంతానికి కూడా మరింత డిమాండ్ అని ఉంది, డంపింగ్ యార్డ్ ఉన్న స్థలంలోని యధావిధిగా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు శుద్ధిచేసి, తడి, పొడి బెండలను జీరో వేస్టేజ్ ప్లాంట్ కు తరలించి అక్కడ గ్యాస్, విద్యుత్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ దీంతో ఉపాధి లభించడంతోపాటు నగరానికి మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 

 రామానుజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్

మరిన్ని వార్తలు