హర్మన్‌ప్రీత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

14-11-2026 | 05:00am

జైపూర్, నవంబర్ 13: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె మైనపు విగ్రహాన్ని జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేష నల్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్మన్‌ప్రీత్ కౌర్ ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ విగ్రహాన్ని జైపూర్లోని ప్రసిద్ధ నహర్ఘర్ కోటలో ఉన్న జైపూర్ వాక్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

2025 లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు కల్పనా చావ్లా, సైనా నెహ్వాల్ వంటి వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.తన మైనపు విగ్రహాన్ని తొలిసారి చూసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించింది. దీనిని తయారు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.


మరిన్ని వార్తలు