యువతలో పెరుగుతున్న మధుమేహం
ముందస్తు పరీక్షలు తప్పనిసరి
కామినేని వైద్యుల సూచన
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): యువతలోనూ మధుమేహం కేసులు పెరుగుతున్నాయని కామినేని ఆసుపత్రి(Kamineni Hospital) వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ముందస్తు పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని సూచించారు. కామినేని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని మాట్లాడుతూ.. అతిగా దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జన, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ బి. శ్రావ్య మాట్లాడుతూ.. యువతలో ప్రీ-డయాబెటిస్, ఊబ కాయం పెరగడానికి వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయ డం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి ప్రధాన కారణాలని తెలిపారు. ప్రీ-డయాబెటిస్‌ను హెచ్చరికగా భావించి బరువు నియంత్రణ, వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మా ర్పులు చేసుకోవాలని సూచించారు. లక్షణా లు కనిపించే వరకు వేచి చూడకుండా ముం దస్తు పరీక్షలు చేయించుకోవాలని కామినేని ఆసుపత్రి వైద్యులు పిలుపునిచ్చారు.