జెన్‌జీ రిలేషన్‌షిప్స్‌ను చర్చించే రోమియో జూలియట్

30-09-2026 | 05:35am

హర్షిత్, విశాఖ ధిమాన్(Harshit, Visakha Dhiman) జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జీ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్(Romeo and Juliet)’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కథలోని కోర్ పాయింట్‌ను ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్.

ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో నేటి సంబంధాల తీరుతెన్నులను హీరో వివరించే విధానం ఆసక్తికరంగా ఉంది. దీంతో ఇదొక సాధారణ లవ్‌స్టోరీ కాదనే విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుత జెన్‌జీ ప్రేమను, రిలేషన్‌షిప్స్‌ను, గొడవలు, బ్రేకప్స్‌ను ఎలా చూస్తోంది? సిట్యుయేషన్షిప్స్, సోషల్ మీడియా, పబ్లిక్ బ్రేకప్స్, మారుతున్న రిలేషన్షిప్ అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి: చెడ్డగా ఏమీ లేదిక్కడ!

ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు తెలిసిన భాష, రిలేషన్‌షిప్ డైనమిక్స్‌తో కథను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్; సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: యువ కిరణ్; ప్రొడక్షన్ డిజైన్: కర్తా ప్రొడక్షన్స్, ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి; నిర్మాతలు: సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల; రచయిత: భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాగతి; దర్శకత్వం: భార్గవ్ మాచర్ల. 

మరిన్ని వార్తలు