సైబర్ క్రైమ్‌లో విరోష్ టీమ్ ఫిర్యాదు
విజయ్ దేవరకొండ, రష్మికపై(Vijay Deverakonda, Rashmika) దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్‌లో(Cybercrime) ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో(Koffee with Karan show) విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో(Social Media) కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా కావాలనే చేసే తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్‌కు అందజేశారు. విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు హామీ ఇచ్చారు.