కోలాట ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్న భవాని బృందం

05-11-2026 | 06:55pm

వెంకటాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): టీటీడీ హన్మకొండ(TTD Hanamkonda) ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట బృందాల(Bhavani Kolata Troupe) ప్రదర్శనలో మండల కేంద్రానికి చెందిన భవాని కోలాట బృందం(Bhavani Kolata Troupe) మహిళలు తమ అద్భుత ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ కళారూపమైన కోలాటాన్ని ఎంతో చక్కగా, లయబద్ధంగా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మహిళలు సమన్వయంతో అడుగులు వేస్తూ, కోలాట కర్రల విన్యాసాలతో తమ ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రతిబింబించే కోలాట ప్రదర్శనలో వెంకటాపూర్ వనితలు చూపిన ప్రతిభకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు అందించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ కళలను కాపాడుతూ, వాటిని మరింత మందికి పరిచయం చేయడంలో మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భవాని కోలాట బృందం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బృందానికి ప్రోత్సాహం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు