గ్రామాల అభివృద్ధిపై సీతక్క వ్యాఖ్యలు విడ్డూరం

07-11-2026 | 05:55pm

భారాస సీనియర్ నాయకుడు మల్క రమేష్

వెంకటాపూర్, నవంబర్ 07 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి, రామప్ప చెరువుకు నీటి సరఫరా, కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి సీతక్క(Minister Seethakka) చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్క రమేష్(BRS Leader Malk Ramesh) విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు.

రామప్ప చెరువుకు భీంగనపూర్ చెరువు నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కృషితోనే జరిగాయని పేర్కొన్నారు. జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగునీటి వనరు ఏమిటో మంత్రి సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం మానుకొని మేడిగడ్డ సమస్యలను పరిష్కరించి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని మల్క రమేష్ హితవు పలికారు.

మరిన్ని వార్తలు