చెడు వ్యసనాలు... ప్రేమ విహాలపై నృత్య ప్రదర్శన
దండారి ఉత్సవాల్లో యువతకు సందేశం అందిస్తున్న గిరిజన యువత
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులు జరుపుకునే దండారి ఉత్సవాల్లో చెడు వ్యాసనాల తో పాటు ప్రేమ వివాహాలు, చదువుకోవడంతో ఉండే లాభాలపై నృత్య ప్రదర్శన చేస్తున్నారు. నృత్య ప్రదర్శన ద్వారా పాటలతో చెడు వ్యసనాలైనా గంజాయి, మద్యం తాగడంతో వచ్చే అనర్ధాలను వివరించడంతోపాటు సెల్ఫోన్ ద్వారా ప్రేమ వివాహాలకు ఆకట్టుకోవద్దని, పెద్దలు నిర్ణయించిన పెళ్లిలు చేసుకోవాలని యువతకు ఆటపాటల ద్వారా మార్గదర్శనం చేస్తున్నారు. తమ పిల్లలను ఆటపాటలతో విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, చట్టాలు, ఉన్నత స్థాయికి వెళ్ళుటకు చదువు ఉపయోగపడుతుందని దండారి ఉత్సవాల్లో ప్రదర్శన ద్వారా తెలుపుతున్నారు.