మాంస విక్రయ దుకాణాల్లో అధికారుల తనిఖీలు
07-11-2026 | 05:51pm
శివ్వంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట మండల(Shivvampet Mandal) కేంద్రంలోని మటన్, చికెన్ విక్రయ దుకాణాల(Meat Shops)ను పశువైద్యాధికారి ఇన్చార్జి డాక్టర్ ఫాతిమా(Veterinary Officer-in-Charge Dr. Fatima), సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాంస విక్రయ దుకాణాల్లో పరిశుభ్రత, మాంసం నాణ్యత, విక్రయాల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి, గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య, వార్డు సభ్యులు కామలయ్యగారి మాళేశ్వరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.