ఎల్‌నినోపై అవగాహన ర్యాలీ

07-11-2026 | 05:47pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జోహార్ ఉన్నత పాఠశాల(Johar High School) కరస్పాండెంట్ హమీదా ఆధ్వర్యంలో శనివారం ఎల్‌నినో ప్రభావం(El Nino Impact), పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులను చేతబూని ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ హమీదా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రకృతి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను నిలిపివేసి విద్యుత్ ఆదా చేయాలి.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న నీటి వనరులను కాపాడుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు