అన్నదానం.. మహా గొప్ప సేవ
- సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ
- పరమేశ్వర ఫ్లైయాష్ బ్రిక్స్ ఆధ్వర్యంలో అన్నదానం
వెంకటాపూర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): అన్నదానం మహా గొప్ప సేవ అని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యకార్యం మరొకటి లేదని సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ(Sarpanch Mamidisetti Suguna) అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలో పరమేశ్వర ఫ్లైయాష్ బ్రిక్స్ అధినేత రామిడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ.. అన్నదానం ద్వారా ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంతో పాటు సేవాభావం, మానవత్వం పెంపొందుతాయని, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేరకు పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు. పరమేశ్వర ఫ్లైయాష్ బ్రిక్స్ ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.