రామప్ప ఆలయానికి స్టీలు హుండీ బహుకరణ

05-11-2026 | 07:00pm

వెంకటాపూర్, నవంబర్ 05 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యునెస్కో(World-renowned UNESCO) గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి(Ramappa Temple) విశాఖపట్నంకు చెందిన కీల ప్రదీప్ కుమార్, ఝాన్సీరాణి దంపతులు స్టీలు హుండీని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఇమ్మడి భాస్కర్ మాట్లాడుతూ..

భక్తులు ఆలయ అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. భక్తుల సౌకర్యార్థం హుండీని బహుకరించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భక్తులు, దాతల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బందిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు