లక్ష్మణ్ బాబుని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
వెంకటాపురం నూగూరు నవంబర్ 4 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలుకు గాయమై విశ్రాంతి తీసుకుంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబుని బుధవారం వెంకటాపురం బీఆర్ఎస్ నాయకులు గుడవర్తి నరసింహమూర్తి(Gudavarthi Narasimhamurthy) కలిసి పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వెంకటాపురం (నూగురు) బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ లక్ష్మణ్ బాబు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాలుకు గాయమైనా పార్టీ కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెట్టడం అభినందనీయం. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. పరామర్శించిన వారిలో వెంకటాపురం బీఆర్ఎస్ నాయకులు ముడుంబా శ్రీనివాస్. మంచర్ల నాగేశ్వరరావు.బట్ట నాగేందర్. కుషం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.