ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

14-10-2026 | 04:58pm

-పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం.

-అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం: సర్పంచ్ నరేష్ నాయక్

కోనరావుపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం(Telangana government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు లకవత్ బుజ్జి దేవేందర్ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నరేష్ నాయక్ హాజరై మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు నాయక్, పంచాయతీ కార్యదర్శి ముక్తార్ పాషా, ఆత్మ కమిటీ సభ్యుడు తిరుపతి, వార్డు సభ్యులు నారాయణ, రవి, బల్కార్ రాజు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు