ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీఓ

14-10-2026 | 04:53pm

దామరచర్ల అక్టోబర్ 14: దామరచర్ల మండలంలోని రాళ్ల వాగు తండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం ఎంపీడీఓ కే వెంకటయ్య(MPDO Venkataiah) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ అధికారులు ఇప్పుటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్య తీసుకోవాలని ఆదేశించారు.

వి బి జి రాంజీ పథకంలో భాగంగా గ్రామంలో జరుగుతున్న లను ట్రాంచ్ పనులను పరిశీలించారు. గ్రామంలో మురికి నీరు నిల్వ ఉండకుండా మ్యాజిక్ సోఫిట్ నిర్మించుకోవాలని ఇంటి యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ నాయక్ ఉప సర్పంచ్ నాగమణి , పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ , ఫీల్డ్ అసిస్టెంట్ బాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు