స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్లస్టర్ లో 5వ బెటాలియన్‌కు ఘన విజయం
కమాండెంట్ సివి లక్ష్మీకాంత్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ ధర్మారావుకు పతకాలు
ములుగు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ అకాడమీ(Telangana Police Academy)లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో క్లస్టర్(సి)లో 5వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంత్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ ధర్మారావు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
జిఓస్ విభాగంలో కమాండెంట్ లక్ష్మీకాంతరావు ఒక వెండి, రెండు కాంస్య, అసిస్టెంట్ కమాండెంట్ ధర్మారావు రెండు కాంస్య పథకాలు సాధించడం జరిగింది. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటిన కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్‌ను 5వ బెటాలియన్ అధికారులు, సిబ్బంది అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపుతూ పోలీసు సిబ్బందికి వారు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు, సిబ్బంది విజేతలకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.