జలం కోసం జల్లెడ!

22-10-2026 | 05:20am
  1. భారీగా బోరుబావుల తవ్వకాలు
  2. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలపై ప్రభావం

కల్వకుర్తి అక్టోబర్ 21 : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు(Groundwater) అడుగంటి పోతుండటంతో రైతులు నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. సాగులో ఉన్న పం టలను కాపాడుకునేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి కొత్తగా బోరుబావులు తవ్విస్తుండటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత కొన్నేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పోవడంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి.

దీంతో సాగులో ఉన్న పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. పంటలను కా పాడుకునేందుకు రైతులు అప్పులు చేసి మరీ కొత్త బోరుబావులు తవ్విస్తున్నారు. ఫలితం లేకపోయినా మరో ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

పంటలను కాపాడుకునేందుకు అప్పులే దిక్కు

వానాకాలం సీజన్ ముగుస్తున్నా, యా సంగిలోనైనా కొంతమేర పంటలు సాగు చేసుకోవాలనే ఆశతో రైతులు బోరుబావుల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో బోరు బండ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు కాలువల ద్వారా నామమాత్రంగానే నీరు అందుతుండటంతో సాగులో ఉన్న పంటలకు నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్ప టికే పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికి వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి.. 

నీటి కోసం విచ్చలవిడిగా కొత్త బోరుబావులు తవ్విస్తుండటంతో భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త బోరుబావుల తవ్వకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ, పంటలను కాపాడుకునేందుకు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో బోర్లు వేయిస్తున్నారు. నీటి లభ్యత తగ్గిపోవడం ఒకవైపు, పెట్టుబడుల భారం మరోవైపు రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి.

ఆయిల్‌పామ్ తోటలపై తీవ్ర ప్రభావం.. 

భూగర్భ జలాల తగ్గుదల ప్రభావం ప్రధానంగా ఆయిల్పామ్ తోటలపై పడే ప్రమాదం ఉంది. గత పదేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, నీటి వనరులు అందుబాటులో ఉండటంతో జిల్లాలో పెద్దఎత్తున ఆయిల్పామ్ సాగు చేపట్టారు. అయితే ఈ పంటకు నిరంతరం తగినంత నీరు అందించడం అవసరం. ప్రస్తుతం భూగర్భ జలాలు పడిపోవడంతో తోటలకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. దీంతో ఆయిల్పామ్ రైతులు సైతం కొత్త బోరుబావులపై ఆధారపడుతున్నారు.

ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ఆయిల్పామ్ తోటలు దెబ్బతిని దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న సాగు ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ నీటి వనరుల కల్పనతో పాటు రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.


మరిన్ని వార్తలు