మూడేళ్లుగా ముందుకెళ్ళని విస్తరణ

28-09-2026 | 11:45pm

ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

బిజినేపల్లి, సెప్టెంబర్ 28: ఉమ్మడి పాలమూరు జిల్లాకే కేంద్రంగా ఉన్న బిజినేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా, రోడ్డు విస్తరణ పనులు మూడేళ్లుగా ముందుకు సాగకుండా ఉండటంతో ప్రభుత్వ పాలనపై, పాలకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) హయాంలో ప్రారంభమైన పనులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటుక మందం పని ముందుకు సాగకపోవడం కోసమెరుపు అని మండల ప్రజలు అంటున్నారు.

కొత్త ప్రభుత్వం, కొత్త పాలకుల హయాంలో మరింత అభివృద్ధి చెందుతుంది అని అనుకున్న మండల వాసులకు నిరాశలే మిగిలాయి. రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్లలో పిచ్చి మొక్కలు పెరగడమే కాకుండా, స్థానిక వ్యాపారులకు చెత్త కేంద్రాలుగా మిగిలాయి. అంతే కాకుండా రోడ్డు నిర్మాణం సమయంలో కనీసం సరైన సూచికలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం కలెక్టర్ అయిన స్పందించి అభివృద్ధిలో వేగం పెంచుతారా లేక చూసి చూడనట్టుగా, పట్టి పట్టనట్టుగా ఉంటారా అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు