వరి విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ

29-09-2026 | 02:30pm

బేతంపూడి PACSలో KVK ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

టేకులపల్లి, (విజయక్రాంతి): వరి విత్తనోత్పత్తిలో ఆధునిక సాంకేతికతలను(Modern technology) రైతులు అవలంబించాలని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్తలు సూచించారు. PJTAU–NABARD–PACS ప్రాజెక్టులో భాగంగా బేతంపూడి PACSలో మంగళవారం “వరి విత్తనోత్పత్తిలో సాంకేతికతలు” అంశంపై రైతులకు శిక్షణ ఇచ్చారు.

PACS చైర్మన్, DCCB డైరెక్టర్ లక్కినేని సురేందర్‌రావు మాట్లాడుతూ.. PACS స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందుబాటులోకి వస్తుందన్నారు. డా. వై. ప్రశాంత్ వివిధ రకాల విత్తన తరగతులు, వేరుచేసే దూరం, రోగింగ్ పద్ధతులు, విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ADA లాల్‌చంద్ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి కీలకమని, విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

KVK సీనియర్ సైంటిస్ట్, హెడ్ డా. టి. భరత్ మాట్లాడుతూ ప్రాజెక్టులో చేపట్టాల్సిన విత్తనోత్పత్తి కార్యక్రమాలను వివరించారు. నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో AO అన్నపూర్ణ, CEO ప్రేమ్‌చారి, 35 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు