కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కష్టాలే
కేసీఆర్ చెప్పింది నిజమైంది: బీఆర్ఎస్
దామరచర్ల :అక్టోబర్:16 : కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వస్తే రైతులకు(Farmer) కష్టాలు తప్పువని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు నిజమైయ్యాయని జిల్లా బిఅరెస్ నాయకులు ఎండి యూసుఫ్ అన్నారు. శుక్రవారంనాడు మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల గడుస్తున్నప్పటికీ పూర్తిగా రైతులకు నీరు, విద్యుత్(Water, electricity) అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
గత బిఅరెస్ హయాంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించిన ఘనత కెసిఆర్(KCR) ది అన్నారు. అన్ని విధాలుగా సదుపాయాలు ఉండేటువంటి దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మిస్తే దానికి కనీసం నాణ్యమైన బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అన్నారు . రాష్ట్రంలో మంత్రుల మధ్య పొంతన లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైతులకు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, బొగ్గు సరిగా లేక విద్యుత్ ఉత్పత్తి చేయలేక వారు చేసిన అలసత్వంతో ఒక చీఫ్ ఇంజనీర్ సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
రానున్న రోజుల్లో మంత్రులను,ఎమ్మెల్యేను రోడ్లమీద తిరగనియ్యమని అన్నారు, ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, విద్యుత్ ఉత్పత్తి మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి అంగోతు హతిరాం నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బైరం సంపత్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ నాయక్, శ్రీనివాస్, నాగిరెడ్డి, రామిరెడ్డి, వీర నాయక్, గోపి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు....