గ్రామాల్లో నీటి లీకేజీలను అరికట్టాలి
20-11-2026 | 03:25pm
భైంసా,(విజయక్రాంతి): జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో నీటిని వృధా చేయకుండా లీకేజీలను అరికట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్(District Panchayat Officer Srinivas) అన్నారు. శుక్రవారం కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మిషన్ భగీరథ నీటి లీకేజీ(Mission bhagiratha water leakage) ప్రాంతాలను పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట రవి అధికారులు ఉన్నారు.