గ్రామాలలో క్షయరహిత లక్ష్యాన్ని సాధించాలి...
కొంపల్లిలో ఉచిత టీబీ స్క్రీనింగ్
మునుగోడు, అక్టోబరు 16(విజయక్రాంతి): గ్రామాలలో టిబి పరీక్షలతో క్షయరహిత(Tuberculosis-free through TB testing) లక్ష్యాన్ని సాధించవచ్చునని కొంపెల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ,ఉపసర్పంచ్ విజేందర్ రెడ్డి అన్నారు.జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉచిత మొబైల్ ఏఐ (కృత్రిమ మేధ) చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతతో గ్రామస్థులకు క్షయవ్యాధి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అనుమానిత లక్షణాలున్న వారిని తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత సమన్వయంతో పనిచేస్తే క్షయరహిత నల్లగొండ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ జ్యోతి, సూపర్వైజర్లు అజయ్, సైదులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, టీబీ అలర్ట్ ఇండియా సిబ్బంది, డీపీసీలు ఇనాయత్, శ్రీనివాస్, వెంకన్న, ఎన్టీఈపీ సిబ్బంది ఉన్నారు.