చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

06-10-2026 | 07:06pm

మాగనూరు: దివ్యాంగులకు ఉచిత బస్సు పాస్ కోసం ఈ నెల 8న హైదరాబాదులో బస్సు భవన్(Bus Bhavan) వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాగనూరు మండల ఎన్ పి ఆర్ డి సంఘం అధ్యక్షులు పుంజనూరు బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మాగనూరు మండల కేంద్రంలో ఉచిత బస్సు కోసం ధర్నా కార్యక్రమం యొక్క గోడ పత్రికను విడుదల చేశారు.

సందర్భంగా బాబు మాట్లాడుతూ వికలాంగుల కుల జాతీయ వేదిక ఎన్.వి.ఆర్.డి సంఘం రాష్ట్ర, జిల్లా, పిలుపుమేరకు ఈనెల 8న హైదరాబాద్ లో బస్సు భవన్ ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన మేనిఫెస్టో ఉన్న ఆర్ గ్యారంటీల్లో వికలాంగులకు 6000 పెన్షన్ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.

అలాగే వికలాంగులకు ప్రభుత్వం అన్ని శాఖల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని, 2026 క్యాలెండర్ ప్రకారం 21 రకాల వైకల్యం గల వికలాంగులకు అమలు చేయాలని, అర్హులైన వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలని, సదరన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయాలని, వికలాంగులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఊసే లేదని వారు మండిపడ్డారు. వికలాంగులకు వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతోటే ఈ నెల 8న హైదరాబాద్ లో జరిగే ఆర్టీసీ బస్సు భవన్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. ధర్నా విజయవంతం చేయుటకు ప్రతి ఒక్క దివ్యాంగులు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి సంఘం మండల కార్యదర్శి రవి, వెంకటయ్య, నరసింహులు, అంజప్ప,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు