డ్రగ్స్ రహిత భారత్
2029 డిసెంబర్ 31 టార్గెట్
- మాదకద్రవ్యాలు భవిష్యత్ తరాలకు ముప్పు
- దేశ వ్యతిరేక సంస్థలకు డ్రగ్స్ ముఠాల ఆర్థిక సహాయం
- పోలీసు బలగాలు, ఏజెన్సీలన్నీ ఐక్యపోరాటం చేయాలి
- పోలీసుల సంస్మరణ దినంలో కేంద్రం హోమంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత్‌ను 2029 డిసెంబర్ చివరి నాటికి డ్రగ్స్ రహిత(Drug-free by [a certain date]) దేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలు భవిష్యత్ తరాలకు ముప్పుగా పరిణమించాయని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు ముఠాలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని తెలిపారు.
రానున్న మూడేళ్ల పాటు డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని, మాదకద్రవ్యాలను నిర్మూలించాలని, ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలు, ఏజెన్సీలు అంకితభావంతో, సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలీసు సంస్మరణ దినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ (ఎన్‌పీఎం)లో జాతీయ పోలీస్ స్మారక చిహ్నం (ఎన్‌పీఎం) వద్ద పోలీ సు అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.
9 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 90 మంది పోలీసులతో ‘మాదకద్రవ్యాలపై పోరాటం’ థీమ్‌తో మోటార్ సైకిల్ ర్యాలీని కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశాన్ని మాదకద్రవ్య రహి తంగా మార్చడానికి ప్రధాని మోదీ 2029, డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించారని స్పష్టం చేశారు.
2026లోని మిగిలిన నెలలతో పాటు 2027, 2028, 2029 సంవత్సరాలను కూడా మాదకద్రవ్యాలపై ఐక్య పోరాటం చేయాలని కేంద్రబలగాలను ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని ఒక ప్రధాన జాతీయ ప్రాధాన్యతగా అభివర్ణించారు. మాదకద్రవ్యాలు భవిష్యత్ తరాలకు ముప్పు కలిగిస్తాయని, ఆర్థిక వ్యవస్థపై అనవసర భారాన్ని మోపుతాయని, దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తాయని ఆయన హెచ్చరించారు.
దేశ భవిష్యత్ తరాలను రక్షించడా నికి డ్రగ్స్‌ను నిర్మూలించడం అత్యవసరమని స్పష్టం చేశారు. మాదకద్రవ్య రహిత భారత దేశమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు పనిచేయాలని అన్నారు. మార్చి 31, 2026 నాటికి దేశం దశాబ్దాల నక్సలిజాన్ని నిర్మూ లించిందని, తిరుగుబాటును ఎదుర్కోవడంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు,
సెంట్రల్ ఆరమ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా పోషించిన పాత్రపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఎన్నికల హింసను నిర్మూ లించడంలో దేశం విజయం సాధించిందన్నారు. అయితే పశ్చిమ బంగాల్లో మాత్రం ఎన్నికల హింస ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు దేశంలో ఎన్నికల హింసకు ముగింపు పలికాయని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల తోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి నెలకొందని పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడుతూ, ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల కలిగే బాధకు ఎప్పటికీ తగిన పరిహారం లభించదని, వారి త్యాగాలను వెలకట్టలేమని స్పష్టం చేశారు. కానీ అమరవీరులు, వారి కుటుంబాలు చేసిన సేవ, త్యాగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
‘డ్రగ్స్‌పై పోరాటం’ బైక్ ర్యాలీ దేశ నలుమూలల నుంచి సాగి, ఈనెల గుజరాత్‌లోని ఏక్తానగర్లో జరిగే ఏక్తా పరేడ్‌కు చేరకుం టుందని అధికారిక ప్రకటన తెలిపింది. గతేడాది 154 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 36,852 మంది పోలీసు సిబ్బంది అత్యున్నత త్యాగం చేశారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మహేష్ దీక్షిత్ చెప్పారు.