ఫేక్ సక్సెస్ మీట్స్ వద్దు!
అనకాపల్లి మూవీ ఈవెంట్లో ఇంద్రజ
సీనియర్ నటి ఇంద్రజ(Senior actress Indraja) సినిమా ప్రమోషన్లు(Movie promotions), ముఖ్యంగా ఫేక్ ‘సక్సెస్ మీట్(Success Meet)’ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫలితాల ప్రచారంలో నిజాయితీ ఉండాలని ఆమె కుండబద్దలు కొట్టారు. విక్రమ్ సహిదేవ్(Vikram Sahidev) ప్రధాన పాత్రలో నటించిన ‘అనకాపల్లి(Anakapalli)’ చిత్ర థాంక్యూమీట్‌లో(Thank-you meet) పాల్గొన్న ఇంద్రజ మాట్లాడుతూ.. “ఒక సినిమాలో భాగమైన తర్వాత ఆ చిత్ర ప్రమోషన్లలో పాల్గొనడం నటీనటుల నైతిక బాధ్యత. సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేసినా సరే బాధ్యతగా ఇంటర్వ్యూలు, ఇతర ప్రచార కార్యక్రమాలకు హాజరవుతా.
సినిమా నిజంగా విజయం సాధించినప్పుడే తాను సక్సెస్ మీట్‌కు వస్తా, కేవలం ప్రచారం కోసం పెట్టే ఫేక్ సక్సెస్ మీట్లకు నేను హాజరుకాను. ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూటర్లు చిన్న చిత్రాలను ఆదరించాలి. సినిమా కోసం దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పడే కష్టాన్ని ప్రేక్షకులకు చేరవేయడానికి ప్రమోషన్లు కీలకం. అయితే విజయం విషయంలో మాత్రం మేకర్స్ నిజాయితీగా ఉండాలి” అంటూ హితవు పలికారు ఇంద్రజ.
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే ‘అనకాపల్లి’. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మాతలుగా వ్యవహరించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో విక్రమ్ సహిదేవ్‌తోపాటు చిత్రబృందం పాల్గొన్నారు.