మనీలాలో రెండోరోజు ప్రధాని మోదీ

17-11-2026 | 09:08am

ప్రధాని నరేంద్ర మోదీ మనీలా పర్యటనలో భాగంగా మంగళవారం రెండో రోజు ఆసియాన్–ఇండియా (ASEAN-India), తూర్పు ఆసియా సదస్సుల్లో (East Asia Summit) పాల్గొననున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.

ప్రధాని హోదాలో మోదీ పాల్గొంటున్న 13వ ఆసియాన్ సదస్సు (ASEAN Summit) ఇది. ఈ కీలక పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ (QUAD) దేశాల నేతల ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్‌తో ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం, వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరపనున్నారు.

మరిన్ని వార్తలు