రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన గర్ల్‌ఫ్రెండ్ (Girlfriend) గురించి తొలిసారి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. సోనియా గాంధీ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
కేంబ్రిడ్జిలో తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కు తాను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు రాహుల్ వెల్లడించారు. ప్రేమలో పడాలనుకునే వారు యూనివర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లాలని సరదాగా సూచించారు. అయితే అక్కడి చికెన్ మాత్రం తనకు నచ్చలేదని, దాన్ని తినొద్దంటూ చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
కాగా, సభ అనంతరం ఓ జర్నలిస్ట్ రాహుల్ గాంధీని మీ గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించగా.. 'ఆమె ఇప్పుడు నా ఫ్రెండ్' అంటూ ఆయన నవ్వుతూ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.