PM-KISAN: మీ అకౌంట్‌లో పడ్డాయా?

30-10-2026 | 02:12pm

24వ విడత డబ్బులు వచ్చేశాయ్.. Payment Status ఇలా తెలుసుకోండి!

బనస్కాంత, అక్టోబర్ 30 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత ఆర్థిక సాయం అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా Direct Benefit Transfer (DBT) విధానంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. ఈ విడతలో 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరగా, ఒక్కో కుటుంబానికి రూ.2,000 చొప్పున అందించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.18,680 కోట్ల నిధులను విడుదల చేసింది. PM-KISAN పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతోంది.

ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పెట్టుబడులు, ఇతర సాగు అవసరాలకు ఈ నగదు రైతులకు కొంత ఊరటనిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.4.65 లక్షల కోట్లకు పైగా నిధులు చేరినట్లు కేంద్రం వెల్లడించింది. రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవసాయ రంగంలో Infrastructure అభివృద్ధిపైనా కేంద్రం దృష్టి సారించింది. Agriculture Infrastructure Fund (AIF) కింద అభివృద్ధి చేసిన 521 యూనిట్లను ప్రారంభించడంతో పాటు, అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహించేందుకు 12 Horticulture Clusters ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

వీటి ద్వారా పంటల నిల్వ, Processing, Marketing సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. మీ ఖాతాలో రూ.2,000 జమ అయ్యాయా? రైతులు తమ Payment Statusను తెలుసుకునేందుకు PM-KISAN Portalలోని ‘Know Your Status’ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. Registration Number, Captcha వివరాలు నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే OTP ద్వారా చెల్లింపు వివరాలను పరిశీలించవచ్చు. అలాగే e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా అనుసంధానం లేదా భూమి రికార్డుల్లో లోపాలుంటే నిధుల జమలో ఆలస్యం కావచ్చు. కాబట్టి రైతులు తమ Beneficiary Statusను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు