భారత బౌలర్ల ధాటికి కివీస్ బెంబేలు

07-11-2026 | 10:16am

క్యాచుల డ్రాప్.. వికెట్ల పతనం.. న్యూజిలాండ్‌కు భారత్ షాక్!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో ODIలో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన Bowlingతో కివీస్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 19.2 ఓవర్లకు 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచే భారత పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. టిమ్ సీఫర్ట్ (0), విల్ యంగ్ (6) త్వరగానే పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ప్రమాదకరంగా మారుతున్న డారిల్ మిచెల్‌ను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు ప్రత్యేక వ్యూహంతో బౌలింగ్ చేస్తున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ చేతికి వచ్చిన ఓ కీలక క్యాచ్ చేజారడంతో కివీస్‌కు కొంత ఊరట లభించింది. తాజాగా గుర్నూర్ బ్రార్ మరోసారి దెబ్బకొట్టాడు. టామ్ లేథమ్ (7)ను నమన్ ధీర్ చేతికి చిక్కేలా చేసి పెవిలియన్‌కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ 53 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం డారిల్ మిచెల్ 24 పరుగులతో క్రీజులో ఉండగా, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కివీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని టీమిండియా బౌలర్లు పట్టుదలగా ఉన్నారు.

మరిన్ని వార్తలు