జ్ఞానేశ్.. గద్దె ఛోడ్

09-10-2026 | 05:05am
  1. ఢిల్లీ డే-3
  2. రాజ్‌ఘాట్‌లో మహాత్ముడి సమాధి వద్ద ప్రార్థనలు
  3. ఆ నలుగురికి శిక్ష తప్పదు: రాహుల్ గాంధీ
  4. కన్నాట్ ప్లేస్‌లో ఇండీ కూటమి లంచ్ మీటింగ్
  5. మోదీ, అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని ప్రార్థనలు
  6. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో మూడో రోజూ ఢిల్లీలో ఇండీ కూటమి నేతల నిరసన
  7. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక
  8. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి 
  9. నేడు రాష్ట్రపతిని కలవనున్న ఇండీ కూటమి

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని ఇండీ కూటమి తేల్చిచెప్పింది. ఆయనకు వ్యతిరేకం గా మూడోరోజు గురువారం కూడా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కూటమి ఎంపీలు, నేతలు ఢిల్లీలో నిరసన బాట పట్టారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణులో పాల్, జైరాం రమేశ్‌తోపాటు నేతలంతా ర్యాలీగా రాజ్‌ఘట్‌కు వెళ్లి.. మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు న్నారని.. దేశాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ నలుగురికి శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతియుత నిరసనలు చేపడుతుంటే తమ పై పోలీసులతో దాడి చేయిస్తున్నారని.. ఎవరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. 

అడుగడుగునా పోలీసులు

మంగళవారం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీగా బయలుదేరిన 300 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకోగా.. బుధవారం జంతర్‌మంత ర్ వద్ద నిరసనకు ప్రయత్నించగా.. అక్కడా అడ్డుకున్నారు. దీంతో బుధవారం మధ్యా హ్నం కన్నాట్ ప్లేస్ (రాజీవ్ చౌక్)లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాజ్‌ఘాట్‌కు ర్యా లీగా వెళ్లి.. మహాత్మునికి నివాళులర్పించాలని నిర్ణయించారు. దీంతో కన్నాట్ ప్లేస్ నుంచి రాజ్‌ఘాట్ వరకు పోలీసులు భారీ గా మోహరించారు. ప్రతిపక్షాల నిరసనల కారణంగా రెండు రోజులు హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అప్రమత్తమయ్యా రు. మీటింగ్ అనంతరం ఇండీ కూటమి నేతలు వాహనాల్లో ర్యాలీగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. 

మహాత్మునికి నివాళులర్పించి..!

రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అనంతరం ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా నేతలంతా అక్కడ మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించారు. రాత్రి ఏడుగంటల వరకు అక్కడే ఉండి తిరుగు ముఖం పట్టారు. నాడు దేశస్వాతంత్య్ర కోసం మహాత్మాగాంధీ శాంతియుతంగా పోరాటం చేశారని.. ఆయన బాటలోనే ఇప్పుడు తాము మోదీ, అమిత్ షా చేతుల్లో బంధీ అయిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నామని నేతలు తెలిపారు. చేయబోయే పోరాటం ఏమిటో మీరే చూస్తారని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ జనరల సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. 

మోదీ, షాకు జ్ఞానోదయం కలగాలి: ఖర్గే

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి త్ షా కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని.. వారికి జ్ఞానోదయం కలగాలని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడ్ని ప్రార్థించినట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శాం తియుతంగా నిరసనలు చేపడుతుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉం టే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘స్వాతంత్య్రంతోపాటు ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నా, నిరుద్యోగం పెరిగిపోతున్నా మోదీ సర్కార్‌కు పట్టడం లేదు. ఓట్ల చోరీతో దేశాన్ని కబ్జా చేస్తున్నారు’ అని ఆయ న మండిపడ్డారు. 

నేడు రాష్ట్రపతితో భేటీ

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండీ కూట మి ఎంపీలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలువనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి అపాయింట్‌మెంట్ కూ డా తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌పై వస్తున్న ఆరోపణలను తేల్చాలని డిమాండ్ చేస్తూ తాము శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే అడ్డుకుంటున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో తా ను కూడా పాల్గొంటానని టీఎంసీ చీఫ్, బెం గాల్ మాజీ సీఎం మమతా వెల్లడించారు. 

  1. వాళ్లను వదిలిపెట్టబోం
  2. ప్రజాస్వామ్యాన్ని మోదీ, షా, భగవత్, జ్ఞానేశ్ ఖూనీ చేస్తున్నరు
  3. నిరసనలకు దిగితే అడ్డుకుంటారా?
  4. మావాళ్లు పోలీసులతో కొట్టించడమేమిటని ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఎన్నికల్లో అవక తవకలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగితే అడ్డుకోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వా న్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘మంగళవారం 300 మం ది ప్రతిపక్ష ఎంపీలం ఈసీని కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. బుధవా రం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడు తామంటే అడ్డుకున్నారు. మావాళ్లను కొ ట్టారు. వాళ్లకు శిక్ష తప్పదు’ అని హెచ్చ రించారు. గురువారం మూడోరోజు నిరసనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగ వత్, జ్ఞానేశ్‌కుమార్ కలిసి ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేయాలని చూస్తున్నారని.. ఎ న్నికల వ్యవస్థను వారి ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని ఆరోపించారు.

ఆ నలు గురికి శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈసీని కలిసి ప్రశ్నిస్తామంటే తమను అడ్డుకోవడం ఏమిటని, తప్పుచేయకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారని, మోదీ స ర్కార్‌కు ఎందుకంత భయం అని నిలదీ శారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని.. ఆయనను అరెస్ట్ చేసి విచారించాల్సిందేనని మరోసారి రాహు ల్ గాంధీ డిమాండ్ చేశారు.  అప్పటివర కు తమ ఆందోళన ఆగదని తేల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు.

మరిన్ని వార్తలు