30 సెకండ్లలో ర్యాలీ బంద్
జ్ఞానేశ్‌ను తొలగించాలని మోదీతో చెప్పండి..
- ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ గాంధీ సూచన
- అందరికీ అండగా ఉంటామని ప్రకటన
- నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో ఇండీ కూటమి ర్యాలీ
- నిరసనలతో తాము రోడ్డుమీద పడుతున్నామన్న వ్యాపారులు
- దానికి స్పందనగా ‘ఎక్స్’లో రాహుల్ పోస్ట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను(CEC Gyanesh Kumar) తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) మీరు చెప్తే 30 సెకండ్లలో నిరసనలన్నీ ఆగిపోతాయని ఢిల్లీలోని(Delhi) వ్యాపారులకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్ప ష్టం చేశారు. వ్యాపారులకు తాము అండగా ఉంటామని, దేశ ప్రజల భవిష్యత్తు కోసమే తాము పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో(Ramlila Maidan) ఇండీ కూటమి(INDIA Alliance) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరగనుంది.
దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. పది లక్షల మందిని ర్యాలీకి తరలించేలా కాంగ్రెస్‌తోపాటు కూటమిలోని మిగతా పా ర్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే.. కొన్నిరోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో తమ బతుకులు రోడ్డున పడుతు న్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లలో నిర సనల వల్ల వ్యాపారాలు సాగడం లేదని, ఇ ప్పుడు దీపావళి ఉండటంతో నవంబర్ 1 నాటి నిరసన ర్యాలీని వాయిదా వేసుకోవాలని కోరారు.
దీనిపై సోమవారం ‘ఎక్స్’ వేది కగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఢిల్లీలో ని ప్రతి వ్యాపారికీ అండగా ఉంటాం. వాళ్ల సమస్యను అర్థం చేసుకుంటాం. దేశరాజధానిలో మెట్రో సేవలను ప్రభుత్వం నిలిపివే సింది.. రోడ్లన్నీ దిగ్బంధించింది.. లాక్‌డౌన్ పరిస్థితులను కల్పించింది. వ్యాపారులెవరూ అధైర్యపడొద్దు. ఓట్ చోరీ కారణంగా మీ దుకాణాలు, మీ సేవింగ్స్, మీ పిల్లల భవిష్యత్తు ఏదీ సురక్షితం కాదు. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఓట్ చోరీ కేసులో నాల్గో నిందితుడైన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని మోదీకి మీరంతా చెప్పండి. అప్పుడు 30 సెకండ్లలో ర్యాలీ, నిరసనలు అన్నీ ఆగిపోతాయి’ అని ఆయన పేర్కొన్నారు.