నేటి నుంచి అయ్యప్ప దర్శనాలు

16-11-2026 | 11:02am

నేటి నుంచి అయ్యప్ప దర్శనాలు.. భక్తులకు కొత్త సౌకర్యాలు

అయ్యప్ప భక్తులకు మరో సర్‌ప్రైజ్.. కొచ్చి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో!

పత్తనంతిట్ట: అయ్యప్ప భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న శబరిమల మండల-మకరవిళక్కు తీర్థయాత్రకు వేళైంది. మండలకాలం ప్రారంభం నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచే నిలక్కల్ నుంచి పంబకు భక్తులను అనుమతించనున్నారు. ఆలయం తెరిచిన తర్వాత కొత్త మేల్శాంతిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. వృశ్చికం 1 సందర్భంగా మరుసటి రోజు తెల్లవారుజామున కొత్త మేల్శాంతిలే ఆలయ ద్వారాలు తెరవనున్నారు.

తొలిరోజే 70 వేల మంది భక్తుల రాక అంచనా!

మండలకాలం తొలి రోజైన మరుసటి రోజు సుమారు 70 వేల మంది భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం 22 అరవణ ప్రసాదం కౌంటర్లు, ఐదు వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు నాటికి 50 లక్షల అరవణ టిన్‌లను అందుబాటులో ఉంచాలని దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈసారి AI Parking.. ప్రీపెయిడ్ డోలీ సర్వీస్!

ఈ యాత్రలో భక్తుల సౌకర్యాల కోసం పలు కొత్త మార్పులు తీసుకొచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో AI-based Parking వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. డోలీ సేవలను Prepaid Systemలోకి మార్చారు. భక్తులకు Insurance Coverage కల్పించడంతో పాటు పారిశుధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

కొచ్చి నుంచి శబరిమలకు హెలికాప్టర్ సర్వీస్!

అయ్యప్ప భక్తులకు మరో ప్రత్యేక సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొచ్చిలోని నెడుంబాశేరి విమానాశ్రయం నుంచి నిలక్కల్ వరకు Helicopter Service ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన Booking మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రయాణ ఛార్జీలు, అర్హుల ఎంపికపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి, విమానాల్లో వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

విమానాశ్రయంలో 24 గంటల అయ్యప్ప భక్తుల కేంద్రం!

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CIAL)లో సుమారు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక Pilgrim Facilitation Centre ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 17న దీన్ని ప్రారంభించనున్నారు. ఇందులో 24 గంటల విశ్రాంతి కేంద్రం, వెజిటేరియన్ ఫుడ్, KSRTC బస్సు టికెట్ కౌంటర్లు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, దేవస్థానం Help Desk వంటి సదుపాయాలు ఉంటాయి. పంబకు ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా నడపనున్నారు.

తాగునీటి పైపుల ధ్వంసంపై అనుమానాలు!

మరోవైపు పంబకు వెళ్లే తాగునీటి పైపుల వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. పైపుల వాల్వులు మూసివేసి ఉండటాన్ని గుర్తించిన అధికారులు, దీని వెనుక కుట్ర కోణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు.

మరిన్ని వార్తలు