ఎమ్మెల్యేగా రిజైన్ చేసి పార్టీ మారితే తప్పేంది?

27-10-2026 | 05:25am

అది రాజకీయ ప్రక్రియలో భాగమే 

తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

  1. రాజీనామా, అనర్హత వేటు అంశాలు వేర్వేరు
  2. అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా రాజీనామాను ఆమోదించొచ్చు
  3. రిజైన్ చేసి మంత్రి కావడం కూడా సాధారణమే
  4. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు
  5. తమిళనాడు కేసులో సీజేఐ బెంచ్ కీలక తీర్పు
  6. సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఒక పార్టీ తరఫు న ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చేశాక వేరే పార్టీలో చేరడంలో ఎలాంటి తప్పులేదని.. అదంతా రాజకీయ ప్రక్రియ లో భాగమేనని సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చిచెప్పింది. రాజీనామాకు, అనర్హత వేటుకు ముడిపెట్ట డం సరికాదని..  ఆ రెండు అంశాలు వేర్వేరు అని స్పష్టం చేసింది. అనర్హత వేటు పిటిషన్లు పెండింగ్‌లో(Disqualification petitions pending) ఉండగా.. రాజీనామాలను ఆ మోదించడంలోనూ ఎలాంటి తప్పులేదని, అది స్పీకర్ నిర్ణయానికిలోబడి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

ఇటీవల తమిళనాడులోని(Tamil Nadu) ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు(AIADMK MLAs) తమ పదవులకు రాజీనామా  చేసి అధికార పార్టీ టీవీకేలో చేరారు. వారిని ఐదేండ్ల పా టు పోటీకి అనర్హులుగా ప్రకటించాలంటూ అన్నాడీఎంకే పార్టీ తరఫున మద్రాస్ హైకోర్టులో(Madras High Court) పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు(Madras High Court) కొట్టివేసింది. దీన్ని సుప్రీంకోర్టులో అన్నాడీఎంకే పార్టీ తరఫున  ఎం శ్రీనివాసన్ సవాల్ చేశారు. ఆ ఆరుగురిపై సీబీఐ విచారణ జరిపించాలని, అనర్హత వే టు వేయాలని అప్పీల్ చేశారు.

ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్ మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం నేరపూరితం కాదని, అ లా చేయడం రాజకీయ ప్రక్రి యలో భాగమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఒక పార్టీ లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయాల్లో సహజమే. రాజకీయ ప్రక్రియలో భాగమే. అలా రాజీనామా చేసే వెళ్తుంటారు’ అని పేర్కొంది. 

సీబీఐ విచారణకు నో

ఆ ఆరుగురు పార్టీ ఫిరాయించారని.. అసెంబ్లీలో అధికార పార్టీ మెజారిటీ నిరూపించుకునేందుకే ఎమ్మెల్యేలుగా రాజీనామా చేశారని, వారిపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తమిళనాడులో ఎఫ్‌ఐఆర్ నమోదైందని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. ‘అయితే ఎఫ్‌ఐఆర్ పై దర్యాప్తు జరగనివ్వండి. చట్టం తన పనితాను చేసుకుపోతుంది’ అని తెలిపారు. సీబీఐ విచారణకు నో చెప్పారు. 

రిజైన్ చేసి మంత్రి అవుతున్నారు

ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లి మంత్రులు కూడా అవుతున్నారని, దీన్ని కూడా తప్పుబట్టడానికి ఏమీ లేదని, రాజకీయ ప్రక్రియలో భాగమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే వారి రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్ కోరగా.. ‘రాజీనామా, అనర్హత వేటు అంశాలు వేర్వేరు. అనర్హత  వేటు పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా రాజీనామాను ఆమోదించడమనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనిలో జోక్యం చేసుకోలేం’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఇదీ కేసు..!

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టికెట్లపై ఎస్.జయకుమార్, మరగతం కుమారవేల్, పీ సత్యభామ, ఇసక్కి సుబ్బయ్య, సీ విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ముగ్గురు మే 25న, ఒకరు మే 26, ఇంకొకరు జూన్ 16, మరొకరు జూ న్ 29న తమ పదవులకు రాజీనామా చే సి.. అధికార పార్టీ టీవీకేలో చేరారు. ఇం దులో కుమారవేల్, సత్యభామ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులుగా పోటీ చేసి గెలి చారు. ఈ ఆరుగురి రాజీనామాలను స్పీ కర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ అ న్నాడీఎంకే పార్టీ అప్పట్లోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ ఆరుగురిని ఐదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీకి దూ రంగా ఉంచాలని, అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. అయి తే.. రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినట్లే ఉన్నాయని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు లోబడే వారు రాజీనామాలు చేశారని హైకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అన్నాడీఎంకే పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. సీజేఐ ధర్మాసనం విచారించి పిటిషన్‌ను డిస్మిస్ చే సింది. రాజీనామాలు ఆమోదించినంత మాత్రాన అనర్హత పిటిషన్లు పక్కకుపోవని, ఆ పిటిషన్లపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ కు ఉంటుందని స్పష్టం చేసింది.  

ఎన్నికల ఖర్చు వసూలు చేయాలన్న పిటిషనర్

ఎమ్మెల్యే పదవులకు ఆరుగురు రాజీనామా చేసినందున ఉప ఎన్నికల ఖర్చు కూడా వారి నుంచే వసూలు చేయాలని పిటిషనర్ గతంలో మద్రాస్ హైకోర్టును అభ్యర్థించారు. ఆ మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. హైకోర్టు తిరస్కరించింది.

మరిన్ని వార్తలు