భారత్ సూపర్ పవర్
- ముడి చమురు శుద్ధిలో అద్భుతం
- కొనియాడిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- ఒక దేశ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోబోమని వెల్లడి
- అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతుంటాయని వ్యాఖ్య
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: క్రూడ్ ఆయిల్ శుద్ధిలో (Crude oil refining)భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబి యో (Foreign Minister Marco Rubio)ప్రశంసించారు. ముడి చమురు దిగుమతుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉన్నదని, అదే స్థాయిలో శుద్ధిలోనూ ముందువరుస లో ఉందని, ప్రపంచంలోనే కీలక శక్తిగా దూసుకుపోతున్నదని ఆయన అభినందించారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపం చంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉం టంతోపాటు దేశవ్యాప్తంగా ఇలాంటి రిఫైనరీలు విస్తరించడం శుభపరిణామమన్నారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్ చమురు శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..
భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారీగా ముడి చమురును ఇండియా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్నినేరుగా దిగుమతి చేసుకునే బదులు ఇక్కడే శుద్ధి కేంద్రాల ద్వారా రెడీ చేసుకుంటున్నదని అభినందించారు. ముఖ్యంగా వెనెజువెలా ముడిచమురును శుద్ధి చేయడంలో భారత కంపెనీలకు అనుభవం ఉందని, అది స్థానికంగా మంచి ఫలితాలను ఇస్తున్నదని తెలిపారు.
ప్రజాస్వామ్య దేశాల్లో రాజకీయ విభేదాలు, నిరసనలు సహజం
భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ, నిరసనలపై ఐక్యరాజ్యసమితి నిపుణులు చేసిన విమర్శల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోబోనని, ప్రజా స్వామ్య దేశాల్లో రాజకీయ విభేదాలు, నిరసనలు సహజమని పేర్కొన్నారు. ‘ఇది ప్రజా స్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
రాజకీయ విభేదాలు, ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం సాధారణం. అమెరికాలోనూ ప్రతిరోజూ నిరసన లు జరుగుతుంటాయి. ఒక దేశంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే.. అక్కడ రాజకీయ చర్చలు, భిన్నాభిప్రాయా లు ఉన్నాయని అర్థం’ అని రూబియో వివరించారు.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలం టూ ఢిల్లీలో యువత చేపట్టిన నిరసనలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగానికి పాల్పడుతోందని ఐరాసకు చెందిన 20 మంది మానవ హక్కు ల నిపుణులు ఆరోపించారని, నిరసనకారులను ఏకపక్షంగా నిర్బంధిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
శుద్ధిలో గణనీయ వృద్ధి
భారత్‌లో తొలి చమురు శుద్ధి కార్మాగారం 1901లో అసోంలోని డిడ్బాయ్లో ఏర్పాటైంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశ శుద్ధి సామర్థ్యం ఏడాదికి కేవలం 0.50 మిలియన్ టన్నులు. 1980 నుంచి ఈ రంగంలో పురోగతి మొదలైంది. భారత రిఫైనరీల్లో రష్యా, అమెరికా నుంచి వచ్చే ముడి చమురు కూడా శుద్ధి చేయడం మొదలైంది. జామ్‌నగర్‌లో 1999లో రిలయన్స్ సంస్థ అతిపెద్ద శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.
2026 నాటికి భారత్ శుద్ధి సామర్థ్యం భారీగా పెరిగింది. దేశంలో 23 రిఫైనరీలు ఉండగా.. ఇందులో ఇండియన్ ఆయిల్ గ్రూప్ తొమ్మిది రిఫైనరీలను నిర్వహిస్తున్నది. ముడి చమురు శుద్ధి సామర్థ్యంలో ఇప్పుడు ప్రపంచంలోనే భారత్ నాల్గో స్థానానికి ఎదిగింది. అలా ముడిచమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంగా మార్చి స్థానికంగా వాడుకోవడమే కాకుండా విదేశీలకూ ఎగుమతి చేస్తున్నది. 2025 లెక్కల ప్రకారం భారత్ 61.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తలను ఎగుమతి చేసింది.