18 May, 2026 | 1:58 AM

పాకిస్థాన్‌పై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

25-08-2024 05:14 PM

రావల్పిండి : తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్‌ ఘనవిజయం సాధించింది. టెస్టుల్లో తొలిసారి పాక్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌ 2 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కానీ రావల్పిండిలో జరిగిన మొదటి టెస్ట్‌లో, బంగ్లాదేశ్ బౌలర్లు ఆదివారం ఉదయం సెషన్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సందర్శకులను చారిత్రాత్మక విజయం వైపు నడిపించారు, చివరి రోజున పాకిస్తాన్ బ్యాటింగ్ కుప్పకూలింది.

రావల్పిండి వేదికగా జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ కు బంగ్లా షాక్ ఇచ్చింది. ఓవర్ నైట్ స్కోర్ 23/1తో ఐదో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 55.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగుల చిన్న లక్ష్యాన్ని 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి పాకిస్థాన్‌పై తొలి విజయాన్ని అందుకుంది. జకీర్ హసన్ 15,  షాద్మాన్ ఇస్లాం 9 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో  పాక్  ఆరు వికెట్లు కోల్పోయి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాంటింగ్  చేసిన బంగ్లా దూకుడుగా ఆడుతూ 565 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 13 టెస్టుల్లో 12 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ విజయం సాధించగా, మరొకటి డ్రాగా ముగిసింది.