సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే
25-08-2024 05:22 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, ఆగస్టు 25( విజయక్రాంతి): హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన నాగారం, మద్దిరాల, అడ్డగూడూరు మండలాలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అద్దె భవనాలలో పాలనా జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలను మంజూరు చేయాలని వినతి లేఖ ద్వారా కోరిన ఎమ్మెల్యే మందుల సామేలు దీనితో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






