17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ

21-04-2025 01:33 AM

24 గంటల్లో ఛేదించిన పోలీసులు

రామకృష్ణాపూర్, ఏప్రిల్ 20 :  తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో మంగళసూత్రాన్ని, మరోక ఇంట్లో ఓ మొబైల్ ఫోన్‌న్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన సంఘటన ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని హనుమాన్ నగర్ ఏరియాకి చెందిన బుర్ర రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటి కిటికీ పక్కన పెట్టిన మొబైల్ ఫోన్ ని కొట్టేసిన ఓ దొంగ ఆ ఇంటి ముందు ఉండే మరోక ఇంట్లో ఇరుముల్ల శరణ్య అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుం డగా బయటనుండి ఇంటికి గడియ పెట్టి కిటికీ నుండి ఆమె మెడలోని మూడు తులా ల మంగళసూత్రాన్ని లాక్కుని అక్కడి నుండి బైక్ మీద పారిపోయాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యా దు మేరకు పట్టణ ఎస్త్స్ర రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశా రు. కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు గోదావరిఖని కాకతీయ కాలనీకి చెందిన గుంజ ఇమాన్యుల్‌గా గుర్తించారు. బృందాలుగా ఏర్పడిన  పోలీసులు పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడిని గుర్తించి అతడి వద్ద నుండి మూడు తులాల బంగారు పుస్తెలతాడు, మొబైల్ ఫోన్, బైక్‌ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనలకు పాల్పడే వాడని పేర్కొన్నారు. 24 గంటలు దాటకు ముందే దొంగతననికి ఛేదించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై రాజశేఖర్, కాశిపేట ఎస్సై ప్రవీణ్, సిబ్బంది జంగు, వెంకటేశ్, రాకేష్, మహేష్, శ్రీనివాస్, సతీష్ లు ఉన్నారు.