నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులను అరికట్టాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులను అరికట్టాలని, రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు పురుగుమందులు సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దారు స్వాతి బిందుకు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం డివిజన్ నాయకులు నకిరేకంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరియా యాప్ ను రద్దుచేసి గతంలాగా యూరియా,డి.ఏ.పి కాంప్లెక్స్ ఎరువులను రైతులకు సరసమైన ధరలకు అందించాలని,కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి వారికి అవసరమైన ఎరువులు విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయాలని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా చెల్లించాలి పెండింగ్లో ఉన్న పోడు సాగు రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.






