24 August, 2026 | 10:25 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

మజిలీ డైరెక్టర్‌తో 25వ సినిమా

21-06-2025 02:22 AM

అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘తండేల్’గా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు నిర్మాణ దశలో ఉండగా.. మరోవైపు నాగచైతన్య 25వ చిత్రానికి రంగంసిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతం మేకింగ్‌లో ఉన్న సినిమా తర్వాత చైతూ 25వ చిత్రం పట్టాలెక్కనుండగా.. దానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు.

మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్న ఈ సినిమా కథను డైరెక్టర్ శివ నిర్వాణ ఇప్పటికే చైతూకు చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం అయిపోయింది. గతంలో నాగచైతన్య, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘మజిలీ’ విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అందుకే వీరిద్దరు రెండోసారి చేతులు కలిపారని, రాబోయే చిత్రం ‘మజిలీ’ని మించిన భావోద్వేగాలతో సాగుతుందని సమాచారం.

ప్రస్తుతం శివ నిర్వాణ డైలాగ్ వెర్షన్‌ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ అక్కినేని యువ హీరో కెరీర్‌లో ఇది మైలుచిత్రం కావటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పట్నుంచే అందరి ఆసక్తి నెలకొంది.