24 August, 2026 | 11:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

సూర్య 45వ చిత్రం.. కరుప్పు

21-06-2025 02:21 AM

సూర్య తన మాగ్నమోపస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే, ఈ చిత్రానికి ‘కరుప్పు’ అని టైటిల్ పెట్టారు. శుక్రవారం దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లుక్‌ను రిలీజ్ చేశారు.

టైటిల్ పోస్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సూర్య.. చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియష్ అవతార్‌లో కనిపించారు. సినిమా యాక్షన్‌తో నిండి ఉంటుందని, సూర్య వైల్డ్ పాత్రలో కనిపిస్తాడని పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష కృష్ణన్ తిరిగి ఈ చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. తమ మునుపటి చిత్రాలతో పోలిస్తే.. ఇద్దరూ ఇందులో భిన్నమైన మేకోవర్‌లో కనిపిస్తారు.

ఇంకా ఈ సినిమాలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిన్న ప్యాచ్‌వర్క్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం పూర్తయింది. అదే సమయంలో టీమ్ పోస్ట్ -ప్రొడక్షన్‌పై కూడా పనిచేస్తోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు; యాక్షన్: అన్బరివ్ - విక్రమ్ మోర్; ఎడిటర్: ఆర్ కళైవానన్; ప్రొడక్షన్ డిజైన్: అరుణ్ వెంజారామూడు.