21-06-2025 02:24:07 AM
పలు విజయవంతమైన చిత్రాలతో కమెడియన్‌గా మెప్పించిన ప్రవీణ్ ప్రధాన పాత్రలో ఇప్పుడు ఓ సినిమా రానుంది. ‘బకాసుర రెస్టారెంట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంతో ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మిస్తున్నారు. వైవా హర్ష టైటిల్ రోల్ పోషిస్తుండగా కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్యప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్దస్త్ అప్పారావు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘అయ్యో ఏమిరా ఈ జీవితం’ అనే పాటను ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: బాలసరస్వతి; ఎడిటర్: మార్తండ్ కే వెంకటేశ్; ఆర్ట్: శ్రీరాజా సీఆర్ తంగాల.